
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తాను నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని, బ్యాంక్ అధికారి పేరుతో వచ్చిన కాల్‌ను నమ్మి మోసపోయానని వెల్లడించారు.
ఇరాన్లో షూటింగ్ సమయంలో తన బంధువుకు వచ్చిన నకిలీ వీడియో కాల్ ద్వారా పోలీసులుగా నటిస్తూ బెదిరించిన ఘటనను ఆయన గుర్తుచేశారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన నాగార్జున, తాను ప్రతి 15 రోజులకు ఒకసారి పాస్వర్డ్స్ మారుస్తానని, ఫోన్లో ఫొటోలు కూడా తీసుకోనని తెలిపారు.