
హైదరాబాద్ సమీపంలోని కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీలో 1 గిగావాట్ సామర్థ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, టీసీఎస్, హైపర్ వాల్ట్ ఒప్పందం చేసుకున్నాయి.
సుమారు రూ. 70,000 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టును 18 నుంచి 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, దీని ద్వారా 7,000 మందికి ఉపాధి లభించనుంది.
ఈ డేటా సెంటర్ నిర్మాణంతో పాటు ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా రతన్ టాటా పేరుతో రేడియల్ రోడ్డును నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.