
ఆస్ట్రేలియా నుంచి మరమ్మతుల కోసం అమెరికాకు పంపిన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమాన విడిభాగాలు చైనా చేతికి చిక్కాయి.
ఈ షిప్‌మెంట్ హాంకాంగ్‌కు దారి మళ్లడంతో అక్కడి అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదు.
ఈ ఘటనపై రవాణా మార్గాన్ని రక్షణ శాఖే ఎంపిక చేసిందని తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ పేర్కొంది.