
ఉద్యోగులు విచ్చలవిడిగా ఏఐ టూల్స్ వాడటం వల్ల బడ్జెట్ పెరిగిపోతుండటంతో మైక్రోసాఫ్ట్ సంస్థ తన అంతర్గత ఏఐ సేవల వినియోగంపై కీలక పరిమితులు విధించింది.
ఖరీదైన ఏఐ టోకెన్ల స్థానంలో ఓపెన్ ఏఐకి చెందిన తక్కువ ధర గల జీపీటీ-5.6 మోడల్‌ను అంతర్గత అవసరాల కోసం కొత్త డిఫాల్ట్ ఆప్షన్‌గా ఖరారు చేశారు.
జూలై నాటికి ప్రతి విభాగానికి స్పష్టమైన ఏఐ టోకెన్ బడ్జెట్ లక్ష్యాన్ని కేటాయించామని, ఉద్యోగులు తమ ఖర్చులను చూసుకోవడానికి అంతర్గత డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేశామని కోర్ ఏఐ ఈవీపీ జే పారిఖ్ తెలిపారు.