
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు రెండు డీఏలను విడుదల చేస్తూ ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
1.82 శాతం డీఏను 2025 జనవరి 1 నుంచి చెల్లించనుండగా, 2.73 శాతం డీఏను 2024 జులై 1 నుంచి చెల్లించనున్నారు.
పెంచిన డీఏలను సెప్టెంబర్ జీతానికి కలిపి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.