
ఆగస్టు 30న హైదరాబాద్‌లోని బండ్లగూడ, సికింద్రాబాద్ ప్యారడైజ్, కింగ్ కోఠి, షేక్ పేట్ కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష జరగనుంది.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.
అత్యవసర ప్రయాణ సాయం కోసం విద్యార్థులు 9010203626 నంబర్‌ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.