
హైదరాబాద్ మియాపూర్లోని 550 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో విజయం సాధించింది.
సర్వే నంబర్లు 100, 101కు సంబంధించిన ఈ కేసులో ప్రైవేటు వ్యక్తుల అప్పీళ్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ తీర్పుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం పరిరక్షించుకుంది.