
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మనుషుల్లాగే వివిధ కదలికలు చేయగల రోబోట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
'ALEX' అనే పేరున్న టీషర్ట్ ధరించిన ఓ రోబోట్ ఎర్ర తివాచీపై డప్పుల దరువుకు అనుగుణంగా అద్భుతంగా డ్యాన్స్ చేసింది.
చేతులు ఊపుతూ, లయబద్ధంగా కాళ్లు కదుపుతూ రోబోట్ వేసిన స్టెప్పులను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.