
తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి, ఆ వివరాలను స్పీకర్‌కు అందించాలని డీజీపీని ఆదేశించింది.
ఘటన అసెంబ్లీ వద్ద జరిగినట్లయితే వివరాలను హైకోర్టుకు నివేదించాలని పేర్కొంటూ, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది.