
నిజామాబాద్ జిల్లాలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే స్థానిక రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని ఆయన పేర్కొన్నారు.