
సినిమా షూటింగ్‌లో గాయపడి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు.
ఈ నెల 21న కాకినాడ పోర్టులో షూటింగ్ జరుగుతుండగా బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
ఆసుపత్రి ఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో బాలకృష్ణ ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి.