
స్పెయిన్‌లో అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, తీవ్రమైన ఇళ్ల కొరతను నిరసిస్తూ రాజధాని మాడ్రిడ్‌తో పాటు పలు నగరాల్లో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ నివేదిక ప్రకారం దేశంలో 7 లక్షల ఇళ్ల కొరత ఉండగా, 2025లో ఇళ్ల అద్దెలు దేశవ్యాప్తంగా 8.5 శాతం, మాడ్రిడ్‌లో ఏకంగా 9.7 శాతం పెరిగాయి.
అద్దె పెంపును వ్యతిరేకించిన ఓ 87 ఏళ్ల వృద్ధురాలిని బలవంతంగా గెంటెవేయడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.