
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రూ. 10,000 కోట్ల పెట్టుబడితో సుజ్లాన్ సంస్థ కొత్త విండ్ ప్రాజెక్టులను చేపడుతోంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా 1325 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా, దీనివల్ల సుమారు 4,000 మందికి ఉపాధి లభించనుంది.
మంగళవారం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కణేకల్లు మండలం హులికెర గ్రామంలో కొత్త S144 బ్లేడ్ ఉత్పత్తి లైన్ ప్రారంభం కానుంది.