
క్యాండియర్ హురున్ ఇండియా 2026 మహిళా లీడర్ల జాబితాలో రూ. 1,21,000 కోట్ల వేల్యుయేషన్ గల అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌నకు చెందిన ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి వెటరన్స్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు.
ప్రొఫెషనల్ సీఈవోల కేటగిరీలో రూ. 5,06,600 కోట్ల విలువైన హిందుస్థాన్ యూనీలివర్ సీఈవో ప్రియా నాయర్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
ఈ ఏడాది జాబితాలో 117 మంది మహిళా లీడర్లు చోటు దక్కించుకోగా, వారి సంస్థల మొత్తం వేల్యుయేషన్ రూ. 39 లక్షల కోట్లుగా నమోదైంది.