
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రుల హెయిర్ స్టైలింగ్ మరియు మేకప్‌కు భారీగా నిధులు ఖర్చవుతున్నట్లు తాజాగా అధికారిక సమాచారం వెల్లడైంది.
2019 నుంచి ఇప్పటివరకు కేవలం ఈ సేవల కోసమే దేశ ప్రధానుల నిమిత్తం సుమారు రూ. 4 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు తెలిసింది.
ఈ ప్రభుత్వ నిధుల వ్యయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.