
ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్ మోడల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే టెక్స్ట్, ఇమేజీలకు అదృశ్య వాటర్ మార్కులను జోడిస్తోంది.
ఈ వాటర్ మార్కులు ఎడిటింగ్ చేసినా తొలగిపోని విధంగా రూపొందించబడ్డాయి, వీటిని గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీ వంటి భాగస్వామ్య సంస్థల్లో కూడా అమలు చేస్తున్నారు.
వాటర్ మార్క్ లేనంత మాత్రాన కంటెంట్ ఏఐతో తయారు చేయలేదని భావించకూడదని, ఇది కేవలం క్లాడ్ ప్రాసెస్ చేసిన కంటెంట్‌ను గుర్తించేందుకు మాత్రమేనని సంస్థ స్పష్టం చేసింది.