
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను 2027 నుంచి విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ప్రశ్నలు మారే అడాప్టివ్ పద్ధతిలో నిర్వహించాలని ఐఐటీ కౌన్సిల్ నిర్ణయించింది.
ఈ విధానంలో విద్యార్థి ఇచ్చే సమాధానాల ఆధారంగా ప్రశ్నల కఠినత మారుతూ ఉంటుంది, దీని కోసం లక్షల్లో ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ అవసరం.
కోచింగ్ కేంద్రాల వ్యాపారాన్ని కట్టడి చేయడంతో పాటు బట్టీపట్టే విధానానికి స్వస్తి పలికేందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరీక్షను ప్రవేశపెడుతున్నారు.