బ్రకోలీలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఫైబర్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కాల్షియం, విటమిన్ కె ఎముకల సాంద్రతను పెంచగా, సల్పోరాఫేన్ అనే సమ్మేళనం శరీరంలోని మలినాలను తొలగించి శుద్ధి చేస్తుంది.