
కాకామిగహారాలో జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్ను ఓడించింది.
ఈ విజయంతో వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసిన భారత్ 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంటూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
భారత్ తరఫున లాల్రెమ్సియామి, ఇషిక, నవ్‌నీత్ కౌర్ ఒక్కో గోల్ చేయగా, ఆదివారం సింగపూర్‌తో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.