
ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా పెరగడంతో 50 ఓవర్ల వన్డే ఫార్మాట్ భవిష్యత్తుపై దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం అభిమానుల మద్దతుతోనే వన్డే క్రికెట్ మనుగడ సాగిస్తోందని, ఐసీసీ స్పష్టమైన ప్రణాళికలు లేకపోతే ఈ ఫార్మాట్ సంక్షోభంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.
టెస్టు క్రికెట్ గౌరవం, టీ20 కమర్షియల్ క్రేజ్ మధ్య వన్డే ఫార్మాట్ నలిగిపోతోందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.