
సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న దాడులు పశ్చిమాసియా ఘర్షణలను మరో స్థాయికి చేర్చాయి.
సౌదీలోని మౌలిక సదుపాయాలను గతంలో డ్రోన్లు, క్షిపణులతో టార్గెట్ చేసిన హూతీలు, ఇప్పుడు సరికొత్త ఆయుధాలను ప్రయోగిస్తున్నారు.
ఈ సరికొత్త దాడుల వ్యూహం సౌదీ దేశానికి పెను సవాళ్లను విసురుతోంది.