
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
1950లో 'షావుకారు' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 380 చిత్రాల్లో నటించారు.
ఆమె భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి చెన్నైలోని తేనామ్‌పేట్, సెనోటాఫ్ రోడ్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నట్లు నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ప్రకటించారు.