
తెలంగాణలోని రిజర్వాయర్లపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల మెగావాట్‌కు రూ.1.30 కోట్ల అదనపు భారం పడుతోందని, నిబంధనలు సడలిస్తే పెట్టుబడులు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 19 వేల మెగావాట్లకు చేరిందని, గిరిజన ప్రాంతాల్లో 'ఇందిరా సౌర గిరి జల వికాసం' పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.