
ఉపాధి కోసం ఆరు నెలల క్రితం రష్యాకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు అక్కడి మిలటరీ క్యాంపులో చిక్కుకున్నారు.
ఏజెంట్ మోసంతో మిలటరీ ట్రైనింగ్‌కు బలవంతం చేయగా, నిరాకరించిన యువకులను అధికారులు చితకబాదినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మహమ్మద్ అఫ్జల్ ఖాన్, భూక్యా రవీందర్, అశోక్, మెగవత్ ప్రకాశ్ అనే యువకులను క్షేమంగా స్వదేశానికి రక్షించాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.