
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం 25వ తేదీకల్లా వాయుగుండంగా బలపడి, 28 నాటికి ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 55 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.
శుక్రవారం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి, 26 నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.