
బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య డిఘా వద్ద తీరం దాటి పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది.
ఈ ప్రభావంతో బుధవారం ఏపీలోని 19 జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తిరుపతిలో గరిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, సముద్రంలో అలల తీవ్రత దృష్ట్యా ఉత్తరాంధ్ర మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.