
భూమికి 337 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్రాకో నక్షత్ర మండలంలో TOI-1752 b మరియు TOI-1752 c అనే రెండు కొత్త గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
TOI-1752 b గ్రహం భూమి కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉండి లావాతో నిండి ఉండగా, TOI-1752 c గ్రహంపై నీరు ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
స్పెయిన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆఫ్ అండలూసియా శాస్త్రవేత్తలు ట్రాన్సిట్ పద్ధతి ద్వారా ఈ గ్రహాల ఉనికిని పసిగట్టారు.