
భారత్లో హత్యలు, కిడ్నాప్లకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హిమాంశు భావు, నీరజ్ ఫరీద్పురియాలను అక్టోబర్ 22న అమెరికాలోని లాస్ వేగాస్లో ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు.
హర్యానా స్పెషల్ టాస్క్ఫోర్స్ అందించిన సమాచారం ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హిమాంశు భావుపై ఇంటర్పోల్ నోటీసు కూడా జారీ అయి ఉంది.
నిందితులను భారత్కు రప్పించేందుకు హర్యానా ఎస్టీఎఫ్ అమెరికా అధికారులు మరియు కేంద్ర దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.