
రాష్ట్ర ప్రభుత్వం 22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో చేస్తున్న భూదందాపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ 33 నెలల పాలనలో 'భూ భారతి' అతిపెద్ద కుంభకోణమని ఆరోపిస్తూ, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కోరారు.
ఈ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.