
తెలంగాణలో ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ నెల 19న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి 15 వరకు కేవలం 61 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ కాలంలో సాధారణ సగటు 86 మిమీ కాగా, 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది.