
తెలంగాణ ప్రభుత్వం 'చేయూత' పథకం ద్వారా కొత్త సామాజిక భద్రతా పింఛన్లను మంజూరు చేసేందుకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది.
70 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్లు, 40 ఏళ్లలోపు వితంతువులకు పింఛన్లు మంజూరు చేయాలని, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
పంద్రాగస్టు నాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి పింఛన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు, జిల్లావ్యాప్తంగా వచ్చిన 38 వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.