
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 నుంచి మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది.
ఈ లీగ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించి, జాతీయ స్థాయికి ఎదిగేందుకు మంచి వేదికగా నిలుస్తుందని మిథాలీ రాజ్ పేర్కొన్నారు.
గతంలో స్నేహ దీప్తి వంటి క్రీడాకారిణులు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారని, ఈ లీగ్ ద్వారా మరిన్ని కొత్త ప్రతిభలు వెలుగులోకి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.