
రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కట్టబెట్టే బిల్లుకు సెనేట్ 86-11 మెజారిటీతో ఆమోదం తెలిపింది.
ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే భారత్, చైనాతో పాటు రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అగ్ర దేశాలపై భారీ సుంకాలు పడే అవకాశం ఉంది.
అయితే, తమ ఇంధన అవసరాల్లో 15 శాతం కంటే తక్కువ రష్యా నుంచి దిగుమతి చేసుకునే దేశాలకు ఈ బిల్లులో మినహాయింపు కల్పించారు.