
గుండెపోటుతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో ఆయన స్పృహలో లేరని, ఈఈజీ, ఎంఆర్ఐ బ్రెయిన్, టీసీడీఎస్ పరీక్షల్లో మెదడు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరో 72 గంటల తర్వాత న్యూరాలజికల్ రీ-అసెస్మెంట్ నిర్వహించి స్పష్టత ఇస్తామని వైద్యులు పేర్కొన్నారు.