
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో సూర్యాపేట, తాండూరు, హైదరాబాద్‌తో సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి.
అక్రమ ఆస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగా, జయరాజు నివాసాల్లో కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.