
తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించిన లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఏఐ కంపెనీపై నటి ఊర్వశి రౌతేలా లీగల్ యాక్షన్‌కు దిగింది.
ఈ అనధికారిక వాడకం ద్వారా ఆ సంస్థ బిలియన్ల డాలర్లు సంపాదించిందని ఆరోపిస్తూ రూ. 7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్నట్లు ఆమె టీమ్ వెల్లడించింది.
మరోవైపు ఈ ఆరోపణలను ఆ ఏఐ కంపెనీ సీఈవో షీరాజ్ హసన్ తిప్పికొడుతూ భవిష్యత్తులో వర్చువల్ నటులే ముఖ్యమని స్పష్టం చేశారు.