
కరూర్ తొక్కిసలాట బాధితులకు సీఎం విజయ్ ఇచ్చిన 32 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను మద్రాస్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది.
గతేడాది సెప్టెంబర్లో కరూర్ ఎన్నికల ప్రచారంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చారు.
రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఆర్థిక సాయం అందించవచ్చని, కానీ అర్హత లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.