
హోటళ్లు, విమానాశ్రయాల్లోని పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించే వారి డేటాను 'స్టార్మ్-2945' అనే హ్యాకర్ల ముఠా దొంగిలిస్తోందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
హ్యాకర్లు నకిలీ మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ పేజీలను సృష్టించి, యూజర్ల పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలు మరియు కెమెరా యాక్సెస్‌ను దొంగిలిస్తున్నారని మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది.
ప్రయాణాల్లో ఉన్నప్పుడు పబ్లిక్ వైఫైకి బదులుగా సొంత మొబైల్ డేటా లేదా ఎన్‌క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్లను ఉపయోగించాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.