
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ఆ పార్టీ పాలన వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని, 3.75 లక్షల మందికి పింఛన్లలో కోత విధించిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటా బాకీ కార్డులను పంపిణీ చేస్తూ, రానున్న రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు.