
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రం ట్రైలర్‌కు చైనా ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
రణ్‌బీర్ కపూర్, యశ్ మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలోని విజువల్స్‌ను చైనా ప్రేక్షకులు హాలీవుడ్ స్థాయి చిత్రాలతో పోలుస్తున్నారు.
ఈ చిత్రం భారతీయ పురాణ గాథను ఆధునిక సాంకేతికతతో తెరకెక్కిస్తుండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.