‘EPIC: First Semester’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక మందానా మాట్లాడిన తెలంగాణ యాసపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
‘ఏందయ్యా సామీ’ అంటూ ఆమె పలికిన తీరుపై కొందరు ట్రోల్స్ చేస్తుండగా, మరికొందరు ఆమె తెలుగు నేర్చుకోవడానికి చూపే ఆసక్తిని అభినందిస్తున్నారు.
పరభాషా నటి అయినప్పటికీ తెలుగు పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ఈ యాసతో సినిమాకు భారీ పబ్లిసిటీని తీసుకువచ్చారని మద్దతుదారులు పేర్కొంటున్నారు.