
ప్రస్తుతం దేశంలో 17,600 కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని, ఇవి అమెరికా డాలర్ నోట్ల కంటే 3 రెట్లు, యూరో నోట్ల కంటే 6 రెట్లు ఎక్కువని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము తెలిపారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏటా 3,000 కోట్ల కొత్త నోట్లను ముద్రిస్తుండగా, అదే సమయంలో సుమారు 2,100 కోట్ల పాడైపోయిన నోట్లను ధ్వంసం చేస్తోంది.
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు చలామణి రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోందని, ఖర్చు తగ్గించేందుకు పాలిమర్ నోట్లపై దృష్టి సారిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది.