తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది.
తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ మీటర్లను బిగించనున్నారు.
వ్యవసాయ రంగానికి మరియు రైతులకు ఉచిత విద్యుత్ పథకం కింద ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు.