
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'డైమెన్షనల్' స్టార్టప్ సంస్థ రోబో కుక్కలను నడిపించేందుకు వినూత్న ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు రోబోటిక్ కుక్కలను వీధుల్లో నడిపించాల్సి ఉంటుందని, దీనికి ఎలాంటి రోబోటిక్స్ అనుభవం అవసరం లేదని కంపెనీ తెలిపింది.
ఈ ప్రత్యేక ఉద్యోగానికి గంటకు 20 డాలర్లు (సుమారు రూ.2వేలు) వేతనం ఇస్తామని ప్రకటించడం టెక్ ప్రపంచంలో వైరల్ అయింది.