
మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ, పంట నష్టం అంచనాలపై శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మురసు తుఫాను ప్రభావిత 1,825 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టగా ఇప్పటివరకు 7,850 దెబ్బతిన్న స్తంభాలను బాగు చేసినట్లు అధికారులు తెలిపారు.
తుఫాను బాధితులకు ఇప్పటివరకు 3.82 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించామని, ఆదివారం నాటికి పంపిణీ పూర్తిచేస్తామని సీఎంకు వెల్లడించారు.