
టాలీవుడ్ సీనియర్ నటుడు గౌతమ్ రాజు తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు.
తాను ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని అభిమానులకు స్పష్టం చేశారు.
తన కెరీర్లో 200లకు పైగా సినిమాల్లో నటించానని, దయచేసి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన కోరారు.