
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తుండగా, ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రం టైమ్ ట్రావెల్ నేపథ్యంతో పాటు పౌరాణిక అంశాలు, తండ్రీకొడుకుల అనుబంధం మరియు యువతీయువకుల మధ్య అందమైన ప్రేమకథతో సాగుతుందని రాజమౌళి తెలిపారు.
చిత్రీకరణకు మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, అక్టోబరు నాటికి షూటింగ్ పూర్తై నవంబరు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నట్లు ఆయన వెల్లడించారు.