
అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే జట్టులో తలపడే ‘టెస్ట్ ట్వంటీ’ మిక్స్డ్ జెండర్ క్రికెట్ టోర్నమెంట్ కొలంబోలో జరుగనుంది.
వచ్చే నెల 14 నుంచి 29 వరకు జరిగే ఈ టోర్నీలో నాలుగు ఖండాల నుంచి 13-21 ఏళ్ల వయస్సు గల 160 మందితో కూడిన నాలుగు జట్లు పాల్గొంటాయి.
ప్రతి జట్టులో 20 మంది అమ్మాయిలు, 20 మంది అబ్బాయిలు ఉండి 80 ఓవర్ల ఫార్మాట్లో మ్యాచ్లు ఆడనున్నారు.