
ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో తప్పులు ఉన్నాయని అభ్యర్థుల ఫిర్యాదుల మేరకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ మూడు పేపర్లకు రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది.
ఇంగ్లీష్, కామర్స్ పరీక్షలు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్ష సెప్టెంబర్ 10న నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది.
రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థుల నుంచి అదనపు ఫీజు వసూలు చేయబోమని, మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే విడుదలవుతాయని అధికారులు స్పష్టం చేశారు.