
వర్షాకాలంలో వాతావరణ పీడనం తగ్గడం, తేమ పెరగడం వల్ల కీళ్లలో వాపు, బిగువు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఆర్థోపెడిక్ నిపుణులు తెలిపారు.
శారీరక వ్యాయామం తగ్గడం, విటమిన్ డి లోపం కూడా కీళ్ల నొప్పులను తీవ్రతరం చేస్తాయని, రోజుకు 30-40 నిమిషాల నడక అవసరమని సూచించారు.
తీవ్రమైన నొప్పి, వాపు లేదా ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని హెచ్చరించారు.